![]() |
![]() |
.webp)
మనం ఎన్నో ప్రాంక్ వీడియోస్ చూసాం, చూస్తూనే ఉంటాం. ఐతే సెలెబ్స్ లో వాళ్ళల్లో వాళ్లే ప్రాంక్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు..వాటిని మనం సీరియస్ గా ఎండింగ్ వరకు చూసాక లాస్ట్ లో ఫూల్స్ ఇపోతాం. ఐతే ఎప్పుడూ సెలెబ్స్ మాత్రమే మనల్ని ఫూల్స్ ని చేస్తారా అనుకున్నారో ఏమో ఇద్దరు కామన్ పీపుల్ కలిసి ఇద్దరు సెలెబ్స్ ని ప్రాంక్ చేశారు. నిజంగా ఈ వీడియో చూస్తే విషయం ఎంత దూరం వెళుతుందో అనుకుంటాం..ఐతే విషయం ఏమిటి అంటే శోభాశెట్టి, టేస్టీ తేజ ఇద్దరూ కలిసి షాపింగ్ పూర్తి చేసుకుని కార్ లో ఇళ్లకు బయల్దేరారు. కార్ ని తేజ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో రోడ్డు మధ్యలో ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ బైక్ ని ఆపి మాట్లాడుకుంటూ ఉన్నారు. తేజ ఆ బండి దగ్గరకు వచ్చేసరికి సడెన్ బ్రేక్ వేసాడు.
ఇక బండికి డాష్ ఇచ్చేసాడని బండికి డ్యామేజ్ అయ్యిందంటూ ఆ ఇద్దరూ వచ్చి వీళ్ళ ఇద్దరితో గొడవకు దిగి హడావిడి చేసేసారు." బిగ్ బాస్ సెలబ్రిటీ ఐతే ఏమిటి..డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డ్రైవింగ్ రాదు..ఎంత సెలబ్రిటీస్ ఐతే సారీ చెప్పరా ఏంటి...? డ్రైవింగ్ తో పాటు మాట్లాడ్డం కూడా రాదా... సరే ఈ మొత్తాన్ని వీడియో తీసి మేము కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం" అంటూ తేజతో, శోభాశెట్టితో గొడవ పెట్టుకున్నారు. "భయ్యా మీ కామెడీ బిగ్ బాస్ లో, జబర్దస్త్ లో చేసుకో ఇక్కడ కాదు" అని ఆ కుర్రాళ్ళు అనేసరికి "సారీ లేదు ఏం లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి..నేను బైక్ కి డాష్ ఇవ్వలేదు.." అంటూ తేజ వాళ్ళను తోసేసాడు. అందరూ చూస్తున్నారంటూ శోభా భయపడిపోయింది. చివరికి ఆ కుర్రాళ్ళు కూల్ అయ్యి ఇదంతా ప్రాంక్ బ్రో..అనేసరికి ఊపిరి పీల్చుకున్నారు. "మిమ్మల్ని బిగ్ బాస్ లో చూస్తూ ఉంటాం..మాములుగా బయట కనిపించినా వెళ్ళిపోతూ ఉంటారు కానీ మాట్లాడరు కదా అందుకే ఇలా చేస్తే ఎప్పటికీ గుర్తుంటాం అని అలా సీరియస్ గా మాట్లాడాం..ఇప్పుడు చూడండి కాసేపు మీరు మాట్లాడారు మాతో..ఏం అనుకోకండి " అని ఆ కుర్రాడు షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి తేజ అవాక్కైపోయాడు. "ఇట్టా తయారేంటి పబ్లిక్" అని తేజ సైలెంట్ గా నిల్చున్నాడు. ఇక చివరికి పోలీసులు కూడా ఆ ప్లేస్ కి వచ్చేసరికి అందరూ టెన్షన్ ఇపోయారు. ఆ పోలీసులకు కుర్రాళ్ళు అక్కడేం జరగలేదు అని చెప్పి పంపించేశారు.
![]() |
![]() |